ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’ | Pogaru movie song released on august 6 | Sakshi
Sakshi News home page

ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’

Jul 27 2020 7:41 AM | Updated on Jul 27 2020 8:00 AM

Pogaru movie song released on august 6 - Sakshi

ధ్రువ సర్జా, రష్మికా మందన్న

నటుడు అర్జున్‌ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పొగరు’. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ‘విక్టరీ, అధ్యక్షా, రన్న, ముకుంద మురారి’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన నంద కిశోర్‌ ఈ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. 100కు పైగా చిత్రాలను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్‌ మూవీని నిర్మించిన బి.కె. గంగాధర్‌ ‘పొగరు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కన్నడతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి పాట ‘కరాబు..’ ని ఆగస్ట్‌ 6న రిలీజ్‌ చేయనున్నారు.  సంపత్‌ రాజ్, ధనుంజయ్, రవిశంకర్, పవిత్రా లోకేష్, గిరిజా లోకేష్‌లతో పాటు ‘డబ్లు్యడబ్లు్యఈ’ సూపర్‌స్టార్లు కై గ్రీన్‌ , మోర్గాన్‌ ఆస్టే, జో లిండ్నర్, జాన్‌ లూకాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చందన్‌ శెట్టి, కెమెరా: ఎస్‌.డి. విజయ్‌ మిల్టన్‌ , బ్యానర్‌: శ్రీ జగద్గురు మూవీస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement