
ప్లే బ్యాక్ చిత్రంలో దివంగత జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్ నటనలో సరికొత్త కోణాన్ని చూపించారు. ఇది ఆహాలో మే..
దినేష్ తేజ్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ప్లే బ్యాక్". హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మించారు. మార్చి ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది.
తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 21 నుంచి ప్రసారం కానుంది. వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎలా మాట్లాడుకున్నారు? అనే అంశం చుట్టూ కథ కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో దివంగత జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్ నటనలో సరికొత్త కోణాన్ని చూపించారు. నటన పరంగా 'ప్లే బ్యాక్' అతడి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా చెప్పవచ్చు.
Tring! Tring! ☎️
— ahavideoIN (@ahavideoIN) May 11, 2021
It's a call from 1993.
Pick up at your own risk!
A thriller drama on your way. #Playback premieres May 21.@iam_jakka @idineshtej @AnanyaNagalla @ArjunKalyan @ImSpandanaa @TNRdirector @murthyscribe @UrsVamsiShekar @teju9666 pic.twitter.com/7Gdf8q2D37