Viky The Rockstar: ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Pilla Nuvvu Naaku Praaname First Song From Viky The Rockstar Released - Sakshi

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విక్కి ది రాక్ స్టార్'. సిఎస్‌ గంటా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ‘పిల్లా నువ్వు నాకు ప్రాణమే’ అంటూ సాగే ఈ పాటను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.  

ఈ పాటలో భగ్న ప్రేమికుడి బాధను చూపించారు. సునీల్ కశ్యప్ బాణీలు అందించగా, రాంబాబు గోసల సాహిత్యం అందించారు. కపిల్‌ కపిలాన్‌ ఈ పాటను పాడారు. ఇప్పటికే రాక్ స్టార్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top