A Person Complaint On Bollywood Hero Ranveer Singh Car Insurance Expired - Sakshi
Sakshi News home page

Ranveer Singh Car: రూ.3.9 కోట్ల విలువైన రణ్‌వీర్‌ కారుకు ఇన్సూరెన్స్‌ లేదా? నెటిజన్‌కు షాక్ ఇచ్చిన హీరో

Oct 18 2022 4:42 PM | Updated on Oct 18 2022 6:52 PM

A Person Complaint On Bollywood Hero Ranveer Singh Car Insurance Expiered - Sakshi

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై ఓ నెటిజన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ హీరో నడుపుతున్న కారుకు ఇన్సూరెన్స్ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'దయచేసి ముంబై పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోండి' అంటూ కారు ఇన్సూరెన్స్‌ సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో  జూన్ 28, 2020న బీమా గడువు ముగిసినట్లు ఉంది. అయితే ఆ కారు విలువ దాదాపు రూ.3.9 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇటీవలే రణ్‌వీర్ ముంబై విమానాశ్రయంలో తన ఖరీదైన ఆస్టన్ మార్టిన్‌ను నడుపుతూ కనిపించాడు. అయితే కారు ఫోటోలు తీసిన నెటిజన్ ఇన్సూరెన్స్ లేదంటూ ట్విటర్‌ ద్వారా ఆరోపించాడు. అయితే చివరికి ఆ నెటిజన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. రణ్‌వీర్ సింగ్ నడిపిన కారుకు బీమా ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన రసీదును మీడియాలో పంచుకోవడంతో నెటిజన్ కంగుతిన్నాడు. దీంతో నెటిజన్లు ప్రముఖులపై ఫిర్యాదు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని  సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement