అత్యాచారం చేసిన వ్యక్తికి మద్దతిస్తానా?: ఏక్తాకపూర్‌

Pearl V Puri Arrest In Molestation Case: Producer Ekta Kapoor Shocking Post On Him - Sakshi

మైనర్‌ బాలికపై అత్యాచార, వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు పరల్‌ వీ పూరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్లో నిజం లేదని బాలిక తల్లి వాదిస్తోంది. దీంతో అక్రమంగా పరల్‌ను కేసులో ఇరికించారంటూ హిందీ బుల్లితెర అతడికి మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత ఏక్తా కపూర్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

"నేను ఓ బాలిక మీద అత్యాచారం చేసినవాడికి మద్దతిస్తానా? ఎవరినైనా సరే లైంగిక వేధింపులకు గురి చేసేవారికి అండగా నిలబడతానా? కానీ నిన్నరాత్రి నుంచి నాకు ఎదురైన పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంటగలిసినట్లు అనిపిస్తోంది. మరీ ఇంత దిగజారుతారా? ఇద్దరి మధ్య గొడవలుంటే అందులోకి మూడో వ్యక్తిని అన్యాయంగా లాగుతారా? అసలు ఓ మనిషి సాటి మనిషి మీద ఇలా ఎలా చేయగలడు? 

మైనర్‌ బాలిక తల్లితో చాలాసార్లు మాట్లాడాను. పిరల్‌ అమాయకుడని, అతడికి దీంతో ఏం సంబంధం లేదని ఆమె స్పష్టంగా చెప్పేసింది. తన భర్తే కావాలని అతడిని ఇరికిస్తున్నాడని వెల్లడించింది. సెట్‌లో పని చేసే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇదంతా చేస్తున్నాడని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఘోరమైన తప్పు. 

మీ టూను అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం చిన్నారిని మానసికంగా హింసిస్తూ ఓ అమాయక వ్యక్తిని దోషిగా నిలబెట్టాలని చూడటం అత్యంత దారుణం. ఈ ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేల్చేందుకు నాకెలాంటి హక్కు లేదు. ఆ విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది. కానీ బాలిక తల్లి చెప్పినదాని ప్రకారం.. పిరల్‌ ఏమీ తెలియని అమాయకుడని స్పష్టమవుతోంది. ఇక ఉద్యోగం చేసుకునే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇలాంటి చెత్త ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరం.

పిరల్‌ మీద మోపిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసేందుకు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మిగతా ఇండస్ట్రీస్‌లాగానే చిత్ర పరిశ్రమ కూడా కొంత సురక్షితం, మరికొంత సురక్షితం కాకపోవచ్చు. కానీ సొంత ప్రయోజనాల కోసం చిత్రపరిశ్రమకు చెడ్డ పేరు తీసుకురావడం అనేది అత్యంత నీచమైన పని" అని ఏక్తా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. బుల్లితెర సెలబ్రిటీలు సహా పలువురు అభిమానులు ఆమె పోస్టుకు మద్దు తెలుపుతూ పిరల్‌కు అండగా నిలుస్తున్నారు.

చదవండి: అత్యాచారం, వేధింపులు కేసులో ‘నాగిని 3’ నటుడు అరెస్టు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top