అత్యాచారం, వేధింపులు కేసులో ‘నాగిని 3’ నటుడు అరెస్టు

Naagin Serial Actor Pearl V Puri Arrest: Malwani Police Filed Molestation Case - Sakshi

అత్యాచారం, వేధింపుల కేసులో హిందీ బుల్లితెర నటుడు, నాగిని ‘3’ సీరియల్‌ ఫేం పరల్‌ వీ పూరి అరెస్టు అయ్యాడు. తనను కిడ్నాప్‌ చేసి కారులో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని, అంతేగాక తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్వానీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడిన పరల్‌ వి పూరితో పాటు అతడి ఆరుగురు స్నేహితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం వారంతా కస్టడీలో ఉన్నారని, వారిని విచారిస్తున్నట్లు అధికారిక మీడియాకు వెల్లడించారు. అయితే బాధితురాలు తన కుటుంబంతో కలిసి శుక్రవారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. అదే రోజు(జూ 4) రాత్రి నటుడు పరల్‌ వీ పూరితో పాటు అతడి స్నేహితులను అరెస్టు చేసినట్లు సదరు అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పరల్‌ వీ పూరి చివరిగా ‘బ్రహ్మ రాక్షసి 2’ టీవీ సీరియల్‌లో నటించాడు. 2013లో వచ్చిన ‘దిల్‌ కి నజర్‌ సే కూబ్‌సూరత్‌’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన పరల్‌ వీ,  ఆ తర్వాత  ఎక్తాకపూర్‌ నిర్మించిన ‘నాగిని 3’, ‘బేపనా ప్యార్‌’ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

చదవండి: 
ముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్‌
లైవ్‌లో నీ వయసు అదేనా అని అడిగిన నెటిజన్‌, హీరోయిన్‌ కౌంటర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top