Powen Kalyan Vakeel Saab Movie Climax Fight Photos | Vakeel Saab Fight Scene - Sakshi
Sakshi News home page

లీకైన ‘వకీల్‌ సాబ్‌’ ఫోటోలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Jan 7 2021 4:26 PM | Updated on Jan 7 2021 6:36 PM

Pawan Kalyan Vakeel Saab Climax Pics Leaked - Sakshi

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి  ఆ సినిమాకు సంబంధించిన పోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు.తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్ర‌ముఖ న‌టుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే  ఫైట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు పవన్ తో దిగిన ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్ అయింది.ఈ స్టిల్స్‌ను బట్టి చూస్తే... సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది. కాగా..ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక ‘వకీల్‌ సాబ్‌’ విషయానికి వస్తే.. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement