కుమారుడితో కలిసి ఉదయ్‌పూర్‌ చేరుకున్న పవన్‌

Pawan Kalyan Attends Niharika Konidela Mehandi Cermony - Sakshi

మెగా బ్రదర్, నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరికొన్ని గంటల్లో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో.. చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు. రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ మెగా డాటర్‌ వివాహ వేడుకకు వేదిక కాబోతోంది. ఈ శుభకార్యానికి మెగా హీరోలు అందరూ హాజరయ్యి.. సందడి చేశారు. చాతుర్మాస్య దీక్ష కారణంగా నిహారిక నిశ్చితార్థ వేడుకకు దూరంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ పెళ్లికి వెళ్లడం మాత్రం మిస్‌ కాలేదు. ఇప్పటికే కుమారుడు అకిరానందన్‌తో కలిసి ఉదయ్‌పూర్‌ చేరుకున్న పవర్ స్టార్.. నిహారిక మెహందీ ఫంక్షన్‌లో సోదరులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా బ్రదర్స్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (నిహారిక నిశ్చితార్థం: ప‌వ‌న్ అందుకే వెళ్ల‌లేదు)

కాగా ఇప్పటికే  మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్-ఉపాసన దంపతులు, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, సాయి ధరమ్‌తేజ్‌, చిరంజీవి కుమార్తెలు, అల్లు అరవింద్‌ కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు. ఒక్కొక్కరుగా పెళ్లి వేడుకలకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదిస్తున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top