నిహారిక నిశ్చితార్థం: ప‌వ‌న్ అందుకే వెళ్ల‌లేదు | Pawan Kalyan Skipped Niharika Engagement | Sakshi
Sakshi News home page

నిహారిక‌ ఎంగేజ్‌మెంట్‌లో క‌నిపించ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Aug 14 2020 8:50 PM | Updated on Aug 15 2020 5:37 PM

Pawan Kalyan Skipped Niharika Engagement - Sakshi

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల నిశ్చితార్థం నిన్న రాత్రి వేడుక‌గా జరిగింది. అయితే ఈ కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ అంద‌రూ హాజ‌ర‌య్యారు. కొత్త పెళ్లి కూతురితో ఫొటోలు దిగుతూ సంద‌డి చేశారు. కానీ నిహారిక బాబాయ్‌ జాడ‌ మాత్రం క‌నిపించ‌లేదు. నాగ‌బాబు త‌మ్ముడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంగేజ్‌మెంట్‌కు రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు బ‌య‌లు దేరాయి. నితిన్ పెళ్లి వేడుక‌కు వెళ్లేంత స‌మ‌యం ఉన్న ప‌వ‌న్‌కు సొంత అన్న కూతురి నిశ్చితార్థానికి ఎందుకు వెళ్ల‌లేదంటూ కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. (బా‌పు బొమ్మ‌కు పెళ్లంట: సిగ్గు ప‌డుతోన్న నిహారిక‌)

వారి మ‌ధ్యేమైనా కుటుంబ స‌మ‌స్య‌లున్నాయోమేన‌ని అనుమాన‌ప‌డేంత వ‌ర‌కు వ‌చ్చింది క‌థ‌. అయితే ఇందులో ఏమాత్రం వాస్త‌వం లేదు. నిజానికి ప‌వ‌న్ చాతుర్మాస్య దీక్ష‌లో ఉన్నారు. గ‌త నెల ఈ దీక్ష‌కు పూనుకున్నారు. ఇది‌ నాలుగు నెల‌ల‌పాటు కొన‌సాగుతుంది. ఈ దీక్ష‌లో ఉన్న‌ప్పుడు సాయంత్రం ఆరు త‌ర్వాత‌ ఇల్లు విడిచి వెళ్ల‌కూడ‌దు. ఎంగేజ్‌మెంట్ రాత్రి పూటే జ‌ర‌గ‌డంతో ఆ వేడుక‌లో ప‌వ‌న్ క‌నిపించ‌లేదు. అయితే గురువారం ఉద‌యమే నాగ‌బాబు నివాసానికి వెళ్లి నిహారిక‌ను, ఆమెకు కాబోయే భ‌ర్త చైత‌న్య‌ను మ‌న‌సారా ఆశీర్వదించారు. (ఆర్జీవీ ట్వీట్‌: పవన్‌ను ఓదార్చిన బాబు)

Advertisement
 
Advertisement
Advertisement