హీరో భార్యకు ఇచ్చిపడేసిన హీరోయిన్‌.. మాది పవిత్ర బంధమంటూ.. | Sakshi
Sakshi News home page

Pavitra Gowda: ఆ హీరోతో పదేళ్లుగా ప్రేమలో.. నా కూతురు అతడికి పుట్టలేదు!

Published Sat, Jan 27 2024 3:48 PM

Pavithra Gowda Responds To Darshan Srinivasa Wife Vijayalakshmi Post - Sakshi

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌, హీరోయిన్‌ పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా దర్శన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ ఒక చేట చేర్చి దాన్ని వీడియోగా ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. పదేళ్ల రిలేషన్‌.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని రాసుకొచ్చింది. ఇంకేముంది.. దర్శన్‌ భార్య విజయలక్ష్మికి ఒళ్లు మండిపోయింది. తన భర్తతో కనిపించొద్దని సెట్‌కు వెళ్లి మరీ హీరోయిన్‌ పవిత్రకు వార్నింగ్‌ ఇచ్చిందని, అవసరమైతే కేసు కూడా పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది.

ఖుషి దర్శన్‌ కూతురు కాదు
దీనిపై పవిత్ర సోషల్‌ మీడియా వేదికగా ఓ లేఖ షేర్‌ చేసింది. 'నా పేరు పవిత్ర గౌడ. గతంలో నేను సంజయ్‌ అనే వ్యక్తిని పెళ్లాడాను. మా ఇద్దరికీ కలిగిన సంతానమే ఖుషి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సంజయ్‌కు విడాకులిచ్చాను. నేను ఎప్పుడూ ఎక్కడా ఖుషి.. దర్శన్‌ కూతురని చెప్పలేదు. అయితే దర్శన్‌, నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ మా మధ్య ప్రేమ, కేరింగ్‌ మాత్రం అలాగే ఉన్నాయి.

మా రిలేషన్‌ను తను అంగీకరించింది
ఇంకా చెప్పాలంటే దర్శన్‌ భార్య విజయలక్ష్మికి మా గురించి అంతా తెలుసు. చాలాసార్లు ఫోన్‌లో కూడా మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. అలాగే నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను.

అవమానిస్తున్నారు
విజయలక్ష్మి నా గురించి చెడుగా పోస్టులు పెడుతుంటే బాధేస్తోంది. చాలామంది నన్ను, నా కూతురు ఖుషిని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను' అని వార్నింగ్‌ ఇచ్చింది. మరి ఈ వివాదంపై దర్శన్‌ ఏమని స్పందిస్తాడో చూడాలి!

చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement