Parking Movie Heroine Indhuja Ravichandran Shares Her Experience - Sakshi
Sakshi News home page

Indhuja Ravichandran: అలా చెప్తే హేళనగా చూశారు, అప్పుడర్థం కాలేదు.. కానీ..

Aug 11 2023 7:53 AM | Updated on Aug 11 2023 8:38 AM

Parking Heroine Indhuja Ravichandran Shares Her Experience - Sakshi

ఆరంభ దశలో పలువురు హేళనగా చూశారంది. ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, ఓటీటీ ప్లా

'ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్‌ ఉంటుంది. అలా నాకు నటించడంలోనే కిక్‌ కలుగుతుంది. చిత్రంలో నటిస్తున్నప్పుడు నేను హిందుజాని అనుకోను. పాత్ర స్వభావాన్ని బట్టి మారడం నాకు కిక్‌ ఇస్తుంది’ అని నటి హిందూజా పేర్కొంది. 'మేయాదమాన్‌' చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్‌ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పార్కింగ్‌ చిత్రంలో హరీష్‌ కళ్యాణ్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా హిందూజా ఓ భేటీలో పేర్కొంటూ పార్కింగ్‌ చిత్రంలో తాను అధ్యాపకురాలిగా నటిస్తున్నానని చెప్పింది.

పార్కింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? తద్వారా జరిగే పరిణామాలు ఏమిటి? వంటి అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ చిత్రంలో ఉంటాయని చెప్పింది. ఇందులో కొన్ని ఛాలెంజింగ్‌తో కూడిన సన్నివేశాల్లో నటించానని చెప్పింది. తను కథానాయకగా నటించాలనే ధ్యేయంతోనే ఈ రంగంలోకి వచ్చానని, అయితే ఆరంభంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశానంది. అలాగని వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని భావించి ఇప్పుడు కథానాయిక పాత్రలకే ప్రాముఖ్యతనిస్తున్నట్లు పేర్కొంది.

తాను తమిళ్‌ అమ్మాయినని చెప్పగా ఆరంభ దశలో పలువురు హేళనగా చూశారంది. ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని చెప్పింది. కథా పాత్రలను అర్థం చేసుకొని నటించడానికి మాతృభాష చాలా అవసరం అవుతోందని దర్శకులు భావిస్తున్నారంది. మంచి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని చెప్పుకొచ్చింది హిందూజ.

చదవండి: బిగ్‌బాస్‌ 7 క్రేజీ ప్రోమో.. చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement