ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్‌ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్‌ హీరోయిన్‌

Published Sun, May 26 2024 8:01 AM

Parineeti Chopra Comments On Ranveer Singh

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్‌ రెండేళ్ల క్రితం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌ అయ్యాయి. అదంతా ఆయన ఒక యాడ్‌ కోసం చేసుంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  రణ్‌వీర్‌ సింగ్‌ దుస్తులు గురించి బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్' అనే సినిమాతోనే పరిణీతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ  కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో కూడా నటించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద దుస్తులు కూడా ఉంచుకోడని చెప్పి షాకిచ్చింది.

అలాంటి సమయంలో కూడా దుస్తులు వేసుకోడు
'రణవీర్‌తో నాకు మంచి స్నేహం ఉంది కాబట్టి అతను చేస్తున్న పనులకు నేను కూడా బాగా అలవాటు పడ్డాను.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్‌ దుస్తులతో వచ్చి ఈరోజు ఇదే లుక్‌ అంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. అబ్బా.. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. 

నేను ఇతరుల మేకప్ వ్యాన్‌లోకి సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ ఉన్న వ్యాన్‌లోకి వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించి అతని అనుమతి తీసుకుంటాను. దానికి కూడా కారణం ఉంది. తను నిద్రపోతూ ఉంటాడో లేదా వాష్‌రూమ్‌లో ఉంటాడో అని కాదు.. బట్టలు వేసుకున్నాడో లేదా అని తెలుసుకుని వెళ్తాను. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ, బట్టలు లేకుండా ఎదురుగానే నిలబడి ఉంటాడు. కానీ, అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు. అలాగే సమాధానం ఇస్తాడు.' అని పరిణీతి సెట్‌లో అనుభవాలు పంచుకుంది.

ఒకసారి  రొమాంటిక్  సీన్ చేస్తుంటే..
దుస్తులు లేకుండా చూస్తే రణవీర్‌ ఏమాత్రం ఫీల్ అవ్వడు.. కానీ, ఆ సమయంలో మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే.. తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు కదా.. అలాంటప్పుడు ఎందుకంత బాధ అని చెబుతాడు. ఒకసారి  రొమాంటిక్  సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండానే రణవీర్‌​ సెట్‌లో కనిపించాడు. ఇలాంటి సీన్‌లో నాకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్‌లో ఉన్నట్లు కనిపించాలని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడు. 

నేను ఆయన రూమ్‌లోకి వెళ్లిన ప్రతీసారి బట్టలు లేకుండానే కనిపించేవాడు. నా ముందే కాదు.. తను పబ్లిక్‌లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద విషయం కాదు. అని పరిణీతి చెప్పింది. రణవీర్‌, పరిణీతి చోప్రాల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే ఇవన్నీ చెబుతున్నట్లు ఆమె పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు తాను చేసినందుకు రణవీర్‌ పెద్దగా పట్టించుకోడని కూడా తెలిపింది. తాజాగా అమర్ సింగ్ చంకీలా సినిమాలో పరిణీతి మెప్పించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement