
టాలెంట్ ఆర్టిస్ట్ సత్యదేవ్ (Satyadev) మొదట్లో హీరో స్నేహితుడి పాత్రలు చేసేవాడు. తర్వాత విలనిజం చేశాడు. అలాగే హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోనూ యాక్ట్ చేశాడు. కానీ ఎడిటింగ్‌లో తను కనిపించే దాదాపు 16 నిమిషాల సీన్లను లేపేశారు. కావాల్సినంత ప్రతిభ ఉన్నా.. ఎందుకో కాస్త వెనకబడుతున్నాడు. ఇతడు చివరగా నటించిన జీబ్రా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది.
నేనప్పుడే చెప్పా..
కానీ సత్యదేవ్ దమ్మున్న నటుడని మాత్రం పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడు కింగ్‌డమ్ మూవీలో విజయ్ దేవరకొండ సోదరుడిగా నటిస్తున్నాడు. అలాగే సత్యదేవ్ చేతిలో ఫుల్ బాటిల్, గరుడ: చాప్టర్ 1 చిత్రాలున్నాయి. తాజాగా ఇతడు పరదా సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలో నిర్మాత విజయ్ డొంకాడ.. సత్యదేవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సత్యతో 47 డేస్ సినిమా చేశాను. భయ్యా.. నువ్వు త్వరలోనే కోటి రూపాయల ఆర్టిస్టువి అవుతావు అని ఆ సినిమా షూటింగ్‌లోనే అన్నాను.
చాలా టాలెంట్
ఆ రూ.1 కోటి మార్కు ఆయన ఎప్పుడో దాటేశారు. సత్య చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్‌లానే అనిపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. పరదా సినిమా విషయానికి వస్తే.. ఇందులో అనుపమ ప్రధాన పాత్రలో నటించింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించగా విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న పరదా విడుదల కానుంది.
చదవండి: నా భార్య గర్భం దాల్చింది.. అయినా పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్