మూగబోయిన గాత్రం.. ప్రముఖ సింగర్ కన్నుమూత | Pandavani legend Teejan Bai dies at 70 Pm Modi pays Tribute | Sakshi
Sakshi News home page

Teejan Bai: పద్మ విభూషణ్ గ్రహీత కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళులు

Jul 5 2026 12:13 PM | Updated on Jul 5 2026 12:13 PM

Pandavani legend Teejan Bai dies at 70 Pm Modi pays Tribute

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని తీజన్ బాయి(70) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆమె రాయ్‌పూర్‌లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మే 27న  రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన తీజన్ బాయి.. ఛత్తీస్‌గఢ్ సాంప్రదాయ కళను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో తీజన్ బాయి జన్మించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకువెళ్లినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఇండియాలోని అత్యంత ప్రసిద్ధ జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement