Pallavi Prashanth Parents: రైతు బిడ్డకు 26 ఎకరాలు, 4 కార్లు, కోట్ల ఆస్తి?.. ప్రశాంత్‌ తండ్రి ఏమన్నాడంటే?

Pallavi Prashanth Father Gives Clarity On Crores Worth Properties Rumours In Latest Interview - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో చరిత్రలో తొలిసారి ఓ రైతుబిడ్డ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడికి సోషల్‌ మీడియా అకౌంట్‌ ఉండి బోలెడంత ఫ్యాన్‌బేస్‌ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్‌ రైతుబిడ్డగానే సుపరిచితం. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోనూ మళ్లొచ్చిన.. అంటూ ఎప్పుడూ రైతు పడే కష్టాలే చెప్తుంటాడు. అందుకే బిగ్‌బాస్‌ 7 లాంచ్‌ రోజు బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలు సిసలైన రైతుబిడ్డ అని నిరూపించుకున్నాడు.

రైతుబిడ్డకు నిజంగా అంత ఆస్తి ఉందా?
అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో పదేపదే తాను రైతుబిడ్డ అని చెప్పుకోవడం అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్లకు అస్సలు నచ్చలేదు. దీంతో అతడిని విమర్శిస్తూ అతడి ఆటకు, మాటలకు అడ్డం పడుతున్నారు. హౌస్‌లో పరిస్థితి ఇలా ఉంటే బయట మరో కొత్తరకమైన గొడవ మొదలైంది. ప్రశాంత్‌ పేదవాడేమీ కాదు, అతడికి 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందంటూ కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ ప్రచారంపై పల్లవి ప్రశాంత్‌ తండ్రి స్పందించాడు.

26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి
ఆయన మాట్లాడుతూ.. 'మా గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవంతి ఉన్నాయంటున్నారు. నిజంగా అవన్నీ ఉంటే నా కొడుకు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాడు? నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు. అసలు 26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి. నాకున్నదల్లా ఆరెకరాల పొలం మాత్రమే! దాన్ని పంచితే ప్రశాంత్‌కు రెండెకరాలు వస్తాయంతే! 

రైతులకు ఇస్తే అదే సంతోషం..
రైతులను ఎప్పుడూ చిన్నచూపే చూస్తారు, కానీ పెద్ద చూపు చూడరు. బిగ్‌బాస్‌ ఇంట్లో నా కొడుకుని చులకన చేస్తూ మాట్లాడుతుంటే బాధేసింది. ఒకవేళ నా కొడుకు బిగ్‌బాస్‌ గెలిస్తే వాడు చెప్పినట్లుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకోటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే ప్రాణాలు విడిచారు. వారు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు' అని గద్గద స్వరంతో మాట్లాడాడు ప్రశాంత్‌ తండ్రి.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన విక్రమ్‌ హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2023
Nov 10, 2023, 07:52 IST
బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించి భారీగా...
09-11-2023
Nov 09, 2023, 19:12 IST
ఇంటి గేటు తెరుస్తూ.. మూస్తూ దాగుడుమూతలు ఆడాడు. ఇంతలో యావూ.. మేరా బచ్చా అని అన్న సులేమాన్‌ గొంతు వినబడటంతో...
09-11-2023
Nov 09, 2023, 16:34 IST
ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. మెతో పాటు హౌస్‌లో ఉన్న...
09-11-2023
Nov 09, 2023, 11:20 IST
బిగ్‌ బాస్ ఏ సీజన్‌లో అయినా సరే కంటెస్టెంట్ల మధ్య గొడవలు సహజం.. వారి మధ్య కోపాలు, పంతాలు ఎన్ని ఉన్నా...
08-11-2023
Nov 08, 2023, 23:03 IST
బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో...
08-11-2023
Nov 08, 2023, 15:39 IST
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే...
08-11-2023
Nov 08, 2023, 12:13 IST
అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. తల్లి ప్రేమను చూసి ప్రిన్స్‌ యావర్‌ ఎమోషనలయ్యాడు. దీంతో...
08-11-2023
Nov 08, 2023, 07:55 IST
మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అని చెప్పాడు. హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్‌లో నాగ్‌ సర్‌ ఇచ్చే...
07-11-2023
Nov 07, 2023, 16:55 IST
బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో...
07-11-2023
Nov 07, 2023, 13:24 IST
కోలీవుడ్‌లో జోవికా విజయ్ కుమార్ పేరు గత కొద్దరోజులుగా భారీగా ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన...
07-11-2023
Nov 07, 2023, 11:43 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్‌ నుంచి...
07-11-2023
Nov 07, 2023, 09:02 IST
బిగ్‌ బాస్‌ ఫేమ్‌  శ్వేతా వర్మ  ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆమె...
07-11-2023
Nov 07, 2023, 01:01 IST
జ‌నాల‌కు న‌చ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వ‌ల్ల‌వేస్తుంటాడు శివాజీ. కానీ త‌న‌దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రైనా నామినేట్...
06-11-2023
Nov 06, 2023, 18:06 IST
ప్ర‌తిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్ల‌మైపోతుంది ఇక్క‌డ‌.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్క‌డ కూర్చున్నవాళ్లంద‌రం వేస్ట్‌.. క‌నీసం నా...
06-11-2023
Nov 06, 2023, 16:47 IST
ఆ కంటెస్టెంట్ ఇంటికి వెళ్లి మ‌రీ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు.  ఏ ప్ర‌శ్న‌ల‌డిగినా ట‌పీమ‌ని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ...
06-11-2023
Nov 06, 2023, 08:52 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్‌ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన...
06-11-2023
Nov 06, 2023, 00:00 IST
తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిప‌డ‌తాడ‌ని చెప్పాడు ప్ర‌శాంత్‌. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత అశ్వినికి బాగా సూట‌వుతుంద‌ని...
05-11-2023
Nov 05, 2023, 22:17 IST
అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజ‌ను చూసి జ‌నాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అత‌డిని బిగ్‌బాస్ ఇంఇ...
05-11-2023
Nov 05, 2023, 10:55 IST
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో...
05-11-2023
Nov 05, 2023, 10:05 IST
బిగ్ బాస్ రియాలిటీ షో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ... 

Read also in:
Back to Top