‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ మూవీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే | Oo Antava Mawa Oo Oo Antava Mava Movie All Set To Release | Sakshi
Sakshi News home page

‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ మూవీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే

Feb 17 2023 5:59 PM | Updated on Feb 17 2023 6:25 PM

Oo Antava Mawa Oo Oo Antava Mava Movie All Set To Release - Sakshi

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ...‘‘రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్‌ అంతా  ఇది మన సినిమా అని ఆప్యాయంగా పని చేశారు.కాశ్మీర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ చేశాం. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి.

ఇందులో కామెడీ, హారర్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ప్రసాద్ లాబ్స్‌లో చాలామంది కి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది. చిన్న సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement