ఓటీటీ హీరోయిన్‌గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ | Nithya Menen Kumari Srimathi Movie Direct OTT Release | Sakshi
Sakshi News home page

Kumari Srimathi Movie: ఓటీటీలకే ఓటేస్తున్న ఆ స్టార్ హీరోయిన్!

Sep 16 2023 6:33 PM | Updated on Sep 16 2023 6:44 PM

Nithya Menen Kumari Srimathi Movie Direct OTT Release - Sakshi

ఆమె స్టార్ హీరోయిన్.. దక్షిణాదిలో కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ గత కొన్నాళ్ల నుంచి రూట్ మార్చేసింది. ఓటీటీల్లో దాదాపుగా మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)

పైన చెప్పిందంతా కూడా నిత్యామేనన్ గురించి. 'అలా మొదలైంది' మూవీతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి. మరోవైపు ఈమె బరువు కూడా పెరగడంతో ఛాన్సులు క్రమంగా తగ్గిపోయాయి. మరోవైపు ఓటీటీ అవకాశాలు తలుపుతట్టాయి.

'బ్రీత్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీసులో నటించిన నిత్యామేనన్.. ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలా 'మాస్టర్ పీస్' అనే డబ్బింగ్ సిరీస్ తో త్వరలో రాబోతున్న ఈమె నుంచి మరో స్ట్రెయిట్ ఓటీటీ మూవీ కూడా రెడీ అయిపోయింది. 'శ్రీమతి కుమారి' పేరుతో తీస్తున్న ఈ తెలుగు చిత్రాన్ని త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే నిత్యామేనన్.. బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలకే ఓటేస్తుందని అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ)

Advertisement
 
Advertisement
Advertisement