Macherla Niyojakavargam Movie: 'మాచర్ల నియోజకవర్గం' కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..

Nithin Macherla Niyojakavargam New Release Date Announced - Sakshi

Nithin Macherla Niyojakavargam New Release Date: యంగ్ హీరో నితిన్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎమ్‌ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్లకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అయితే ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌లో మాచర్ల నియోజకవర్గం సినిమాను జూలై 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేశారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు దర్శకనిర్మాతలు. మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. 'డేట్‌ మారింది అంతే.. కలెక్టర్‌ సార్‌ యాక్షన్‌ కాదు..' అంటూ ట‍్వీట్‌ చేశారు. ఈ పోస్టర్‌లో వైట్ షర్ట్‌లో మాస్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు నితిన్. కాగా మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్.

చదవండి: 'మాచర్ల నియోజకవర్గం'లో కేథరిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top