వన్‌ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్‌ సాంగ్ వచ్చేసింది! | Nithiin and Sreeleela Movie Robinhood One More Time Lyrical Out Now | Sakshi
Sakshi News home page

Robinhood Movie: వన్‌ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్‌ లవ్‌ సాంగ్ వచ్చేసింది!

Nov 26 2024 6:31 PM | Updated on Nov 26 2024 7:00 PM

Nithiin and Sreeleela Movie Robinhood  One More Time Lyrical Out Now

భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్  రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా రాబిన్‌హుడ్‌ మూవీ నుంచి వన్‌ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement