ఈ నెలలోనే రకుల్‌ ప్రీత్‌ తమ్ముడి ‘నిన్నే పెళ్లాడతా’ | Sakshi
Sakshi News home page

Ninne Pelladatha: ఈ నెలలోనే రకుల్‌ ప్రీత్‌ తమ్ముడి ‘నిన్నే పెళ్లాడతా’

Published Sun, Oct 9 2022 8:44 AM

Ninne Pelladatha Movie To Release On 14th October - Sakshi

అమన్‌ (హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ తమ్ముడు), సిద్ధికా శర్మ జంటగా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్‌ బాబు, బొల్లినేని రాజశేఖర్‌ నిర్మించిన చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విశ్వక్‌ సేన్, సిద్ధు జొన్నల గడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘వైకుంఠ ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఇందులో నాకు మంచి డైలాగ్స్‌ ఉన్నాయి.’’ అన్నారు.

‘‘ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు రావాలి’’ అన్నారు విశ్వక్‌ సేన్‌. ‘‘అమన్‌ నాకు మంచి మిత్రుడు. మంచి కథను సెలక్ట్‌ చేసుకున్న ఈ నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించిపెట్టాలి’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘మంచి సినిమాకు నన్ను హీరోగా ఎంపిక చేసిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు అమన్‌. ‘‘సినిమా డైలాగ్స్, మేకింగ్‌ బాగుంటాయి’’ అన్నారు వైకుంఠ. ‘‘దర్శకుడు మాకు చెప్పిన కథను చెప్పినట్టుగా చక్కగా తెరకెక్కించాడు’’ అన్నారు బొల్లినేని రాజశేఖర్‌ చౌదరి, వెలుగోడు శ్రీధర్‌ బాబు. నటుడు గగన్‌ విహారి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నవనీత్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement