ఇంకా బతికి ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది: నటి

Nikita Rawal Said She Robbed Of Rs 7 Lakh At Gunpoint In Delhi - Sakshi

Actress Nikita Rawal Robbed at Gunpoint in Delhi: షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఢిల్లీ వెళ్లిన తనకు చేదు అనుభవం ఎదురైనట్లు బాలీవుడ్‌ నటి నిఖిత రావల్‌ తెలిపారు. షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో బెదిరించి రూ. 7 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగలించినట్లు చెప్పారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని గుర్తు చేసుకుని భయాందోళనకు గురయ్యారు. 

ఈ సందర్భంగా నిఖిత మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ఓ మూవీ షూటింగ్‌ కోసం అక్కడే ఉంటున్న మా బంధువుల ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో మా ఆంటి ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఓ రోజు షూటింగ్‌ ముగిశాక రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్తున్నా. మా ఇంటికి సమీపంలోకి రాగానే ఓ ఇన్నోవా కారు వేగంగా నా వైపుకు వచ్చి ఆగింది. వెంటనే కారులోంచి నలుగురు వ్యక్తులు బయటకు దిగారు. వారంతా నల్లటి మాస్క్‌లు ధరించి ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తుపాకి నా తలకు గురి పెట్టి నా దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇవ్వమని బెదిరించాడు. ఆ సయమంలో నా ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, చెవి కమ్మలు, వాచ్‌, డైమండ్‌ పెండెంట్‌, డబ్బులను లాక్కెళ్లారు’ అని ఆమె వివరించారు.

చదవండి: ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్‌ చేశా; అందుకే చెప్పలేదు: బాలీవుడ్‌ నటి

‘వారిని అలా చూడగానే నా మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. 10 నిమిషాల పాటు ఏం జరుగుతుందో నాకర్థం కాలేదు. ఈ ఘటన జరగగానే నేను ఇంట్లోకి పరుగెత్తికెళ్లి తలుపులు వెసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాను. ఆ తర్వాత రోజు తిరిగి ముంబై వచ్చాను. అయినా నేను అభద్రత భావంతోనే నిద్ర లేచాను. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా దీని నుంచి బయట పడలేకపోతున్నా. ఇంకా నేను బతికే ఉన్నాను అంటే నాది నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు నన్ను దుండగులు హత్య చేసి ఉంటే లేదా లైంగిక దాడికి పాల్పడి ఉంటే నా పరిస్థితి ఏంటి. ఇది తలుచుకుంటేనే నా వెన్నులో వణుకు పుడుతోంది’ అంటూ నిఖిత ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Actress Alankrita Sahai: పట్టపగలే నటి ఇంట్లో దొంగతనం.. రూ.6 లక్షల చోరీ

కాగా నిఖిత 2007లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ‘మిస్టర్‌ హాట్‌.. మిస్టర్‌ కూల్‌’లో సహా నటిగా చేశారు. అలాగే అనిల్‌ కపూర్‌ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’తో పాటు పలు చిత్రాలలో ఆమె నటించారు. అంతేగాక 2012 నుంచి ఆమె తెలుగులోనూ పలు చిత్రాల్లో చేశారు. అయితే ఇలాంటి ఘటనే ఇటీవల నటి మోడల్‌ అలంకృత సహాయ్‌ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఒంటిరిగా ఉన్న ఆమెను దుండగులు బంధించి 6.5 లక్షల నగదును దోచుకెళ్లారు. రోజుల వ్యవధిలోనే నటీమణులపై ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top