విడాకులు.. ఆ విషయం తెలుసుకున్నా, ఎంతో ఏడ్చా..:నిహారిక | Niharika Konidela Opens Up About Her Wedding And Divorce With Chaitanya Jonnalagadda, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika Konidela Divorce Reasons: పెళ్లైన ఏడాదికే విడిపోతామనుకోలేదు.. విడాకులపై తొలిసారి ఓపెన్‌ అయిన నిహారిక

Published Fri, Jan 26 2024 12:04 PM

Niharika Konidela Opens Up About Wedding, Divorce with Chaitanya Jonnalagadda - Sakshi

అంగరంగా వైభవంగా పెళ్లి.. రెండు, మూడేళ్లలో ఏ పాపనో, బాబునో తీసుస్తారనుకుంటే విడాకుల పత్రాలతో నిలబడ్డారు. అందరూ షాకయ్యారు. బలవంతంగా కలిసి ఉండమని చెప్పలేకపోయారు, అలాగే విడిపోమని మనస్ఫూర్తిగా అనలేకపోయారు. చేసేదేం లేక ఆ దంపతుల ఎడబాటును చూస్తూ ఉండిపోయారు. ఆ జంట మరెవరో కాదు నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ. తాజాగా తన పెళ్లి-విడాకులపై తొలిసారి స్పందించింది నిహారిక.

పెళ్లి తర్వాత ఎందుకు వదిలేస్తాం?
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నిహారిక మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకున్నందువల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు. మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారు. అది మా వృత్తి. మేమెందుకు దాన్ని వదిలేస్తాం. నిర్మాతగా కొంచెం బిజీ అవడంతో నటనకు దూరమయ్యానంతే! అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అది తెలియకుండా మనకు సెట్‌ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. వాళ్లు మన ఇంట్లో అమ్మలా, నాన్నలా ఉండరు కదా! అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఈ మధ్యే నేర్చుకున్నాను.

ఎంతో ఏడ్చాను
నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలన్నారు. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్‌షిప్‌ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా..  ఇదీ అంతే! నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు.

తట్టుకోలేకపోయా..
కానీ నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. కుటుంబాన్ని దూషించారు. అప్పుడు తట్టుకోలేకపోయాను. అయితే నా కుటుంబం నన్ను ఎప్పుడూ బరువనుకోలేదు. ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఎంతో బాగా తెలిసొచ్చింది. ఈ పెళ్లి- విడాకుల ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చింది. ఇదొక గుణపాఠంగా తీసుకున్నాను. ఎప్పటికీ ఇలా సింగిల్‌గా ఉండిపోను. నాకింకా 30 ఏళ్లే.. మంచి వ్యక్తి కనిపిస్తే చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. నిహారిక చివరగా సూర్యకాంతం(2019) సినిమాలో నటించింది. చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఓ సినిమా చేస్తోంది.

చదవండి: మెగాస్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ వరకు.. అందరికీ వరుస అవార్డులు..

Advertisement
 
Advertisement