Nidhhi Agerwal: పారితోషికం భారీగా పెంచిన నిధి అగ‌ర్వాల్‌

Nidhhi Agerwal Shocking Remuneration For Hero Movie - Sakshi

అందాల నిధి అగ‌ర్వాల్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. న‌ట‌న‌, గ్లామ‌ర్‌తో క‌ట్టిప‌డేస్తున్న ఈ భామ స‌వ్య‌సాచి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ అవ‌క‌పోయిన‌ప్ప‌టికి నిధి అంద‌చందాల‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్నులో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంక‌ర్‌తో కుర్ర‌కారు గుండెల్లో రెళ్లు ప‌రిగెత్తించింది. ఈ మూవీలో న‌ట‌న‌, గ్లామ‌ర్‌తో క‌ట్టిప‌డేసిన ఈ భామ తెలుగులో తాజాగా న‌టించిన చిత్రం 'హీరో'.

యంగ్ హీరో అశోక్ గ‌ల్లాతో జోడీ క‌ట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసింద‌ట‌! ఇప్ప‌టివ‌ర‌కు రూ.50- 80 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న ఆమె ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్న‌ర తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమాకు ఈ రేంజ్‌లో డ‌బ్బులు తీసుకుంద‌ట‌! ఏదేమైనా నిధి సినిమాల స్పీడు పెంచ‌డంతో పాటు రెమ్యున‌రేష‌న్‌ను కూడా బాగానే పెంచేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top