Newsense Telugu Web Series OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

ఆహాలో స‌రికొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’.. టీజర్ విడుదల

Mar 22 2023 6:00 PM | Updated on Mar 22 2023 6:22 PM

Newsense Webseries Streaming On Aha Ott - Sakshi

తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహాలో మరో సరికొత్త వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్ సీజ‌న్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2వ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సిరీస్‌ను నిర్మించారు.

న‌వ‌దీప్, బిందు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.1990-2000 ద‌శ‌కంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ద‌న‌ప‌ల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్ల‌బ్‌లోని స్ట్రింగర్స్ గురించి తెలియ‌జేసిన ప‌వ‌ర్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా నూసెన్స్ సీజ‌న్ 1న రూపొందిస్తున్నారు.

మీడియా పాత్ర, లంచ‌గొండి సంస్కృతి పెరిగిపోవ‌టం, వార్త‌ల ప్రాధాన్య‌త‌, సెన్సేష‌న్ న్యూస్ అనే అంశాల ఆధారంగా సిరీస్‌ నిర్మించారు. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ను విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement