సినిమాను మించిన ట్విస్ట్‌లు.. దర్శన్‌ కేసులో విస్తుపోయే నిజాలు! | Netizens Searching About Pavitra Gowda Afterada Hero Darshan Case, More Deets Inside | Sakshi
Sakshi News home page

Darshan Case: ఇదివరకే పెళ్లి.. నటితో సహజీవనం.. ఆమె కోసమే దర్శన్‌ ఇదంతా చేశాడా?

Published Thu, Jun 13 2024 9:29 PM | Last Updated on Fri, Jun 14 2024 10:55 AM

Netizens Searching About Pavitra Gowda In Kannada Hero Darshan Case

ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్‌వుడ్‌ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్‌ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్‌కు మధ్య రిలేషన్‌ ఏంటని శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

నటిగా ఎంట్రీ ఇచ్చి...

మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్‌ కార్పెట్‌ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్‌తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.

దర్శన్‌కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనం

మరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్‌కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్‌ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. 

వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్‌ తమకు ఆఫర్‌ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement