Netizen Tweet About RRR Item Song, See RRR Team Funny Reaction - Sakshi
Sakshi News home page

RRR Movie: ఐటెం సాంగ్‌ అడిగిన నెటిజన్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీం రిప్లై..

Nov 27 2021 3:23 PM | Updated on Nov 27 2021 4:16 PM

Netizen Tweet About RRR Item Song, See RRR Team Funny Reaction - Sakshi

Netizen Tweet About RRR Item Song, See RRR Team Funny Reaction: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం​ నుంచి ఇప్పటికే  'నాటు నాటు', 'దోస్తీ', 'జనని' పాటలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ఈ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులో ఐటెం సాంగ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.

తాజాగా ఈ విషయంపై ఓ నెటిజన్‌ మూవీ టీంను ప్రశ్నించాడు. 'సినిమాలో ఐటం సాంగ్ ఉందా మావా' అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన మూవీ టీం..'ఏ నువ్వు చేస్తావా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాగా డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement