ఓటీటీలో నాగార్జున కొత్త సినిమా.. నో రిస్క్‌

Is Netflix Buys Nagarjuna Starrer Wild Dog Movie Rights - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న తాజా చిత్రం వైల్డ్‌ డాగ్‌. ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌ మొదటి వారంలోనే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకోంటుంది. ఇవి కూడా పూర్తి కావొస్తుండటంతో వైల్డ్‌ డాగ్‌ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనితోపాటు ఏ ప్లాట్‌ఫామ్‌లో మూవీ రిలీజ్‌  కానుందనే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా సినిమాలు రిలీజ్‌ అయ్యియి. అయితే ప్రస్తుతం థియేటర్లు పునఃప్రారంభం అవ్వడంతో మెల్లమెల్లగా పెద్ద స్క్రీన్‌పై సినిమాలు విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. చదవండి: మొక్కలు నాటిన టాలీవుడ్‌ కింగ్‌

తాజాగా నాగార్జున వైల్డ్‌ డాగ్‌ చిత్రం డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవ్వనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి  కనబర్చకపోవడంతో ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా సేఫ్‌ ట్రాక్‌లో వెళ్లేందుకు చిత్రయూనిట్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాప్‌ డిజిటల్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు ఈ సినిమాకు చెందిన హక్కులను విక్రయించినట్లు సమాచారం. మొత్తం 27 కోట్లకు వైల్డ్‌ డాగ్‌ డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అహిషోర్‌ సోలోమాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. కాగా ‘మనం’ తర్వాత నాగార్జునకు ఈ సినిమా అతిపెద్ద హిట్‌ కానుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.  నాగ్‌తో పాటు బాలీవుడ్‌ నటి దియా మిర్జా, సయామి ఖేర్‌, అలీరెజా ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోలు.. ఇక రచ్చ రచ్చే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top