మొక్కలు నాటిన నాగార్జున | Nagarjuna Akkineni Plant Saplings In Jubilee Hills | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటిన నాగార్జున

Dec 26 2020 2:29 PM | Updated on Dec 26 2020 2:33 PM

Nagarjuna Akkineni Plant Saplings In Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున జూబ్లీహిల్స్‌ సొసైటీ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. మొన్నటివరకు బిగ్‌బాస్‌ 4తో బిజీబిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం సామాజిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 49లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వాల్గో ఇన్‌ఫ్రా ఎండీ, సీఈవో శ్రీధర్‌ రావు పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు జూబ్లీహిల్స్‌ సొసైటీ పార్క్‌ కోసం నాగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని నాగ్‌ కాసేపు సేద తీరారు. చిన్నారి మాస్టర్‌ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెతో ఆడుకున్నారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్‌ రెడ్డి, అశోక్‌బాబుతో పాటు పలువురు కాలనీవాసులు కూడా పాల్గొన్నారు. (చదవండి: ఆయనకు ఫ్యాన్‌ అయిపోయా!)

 



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement