10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార | Sakshi
Sakshi News home page

10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార

Published Sun, Dec 10 2023 7:40 AM

Nayanthara Reaction On Lady Super Star Word - Sakshi

 నీలేష్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై, సత్యరాజ్, తదితరులు నటించిన చిత్రం 'అన్నపూరణి' డిసెంబర్ 1న తమిళంలో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని జి స్టూడియోస్, నాట్ స్టూడియోస్ నిర్మించాయి. చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక బ్రాహ్మణ యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రం. రాజా రాణి తర్వాత జై, నయనతార జంటగా ఈ చిత్రంలో నటించారు. అన్నపూరణి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటులు జై, నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణ పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో జై, నయనతారల కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు, నయనతార మాట్లాడుతూ.. 'రాజా రాణిలో 20 నిమిషాలు మాత్రమే మేమిద్దరం నటించాము. ఆ సినిమా షూటింగ్‌ తర్వాత మేము మంచి స్నేహితులం అయ్యాం. వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నాం. రాజా రాణి సినిమాలో మేము ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చామో అదే విధంగా ఈ సినిమాలో కూడా నటించాం. ఈ సినిమాలో మేము నటించిన సన్నివేశాలు అన్నీ సహజంగానే ఉంటాయి. నేనెలా నటిస్తానో, కెమెరా ముందు జై ఎలా నటిస్తాడో అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు.' అని ఆమె అన్నారు.

నటుడు జై మాట్లాడుతూ 'మహిళల నేపథ్యంలో సాగే చిత్రంలో నయనతారతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మనం తెరపై నేచురల్‌గా మాట్లాడుతూ నటిస్తే అభిమానులకు నచ్చుతుంది. నటించేటప్పుడు మాకు మంచి అవగాహన ఉంటుంది. మేమిద్దరం కలిసి నటించేటప్పుడు మానిటర్ వైపు కూడా చూడము. సెట్‌లో కెమెరా ముందు నయనతార నటనను చూసిన వారు ఎవరైనా ఆమెను లేడీ సూపర్‌స్టార్‌ అనాల్సిందే అని నేను అంటే..  నయనతార, ''అలా అనకండి, చెబితే తిడతారు. కొంతమంది నేను ఇంకా అక్కడి వరకు చేరుకోలేదని అంటారు. నేను అమ్మాయిని కాబట్టి నాపై విరుచుకుపడతారు.. మళ్లీ నాపై విమర్ళలు మెదలుపెడుతారంటూ ఇలా చెప్పింది.

అన్నపూరణి చిత్రానికి సంబంధించినంతవరకు అన్ని విషయాలు తన ఇష్ట్రపకారం జరిగాయని చెప్పింది. ఒక్క లేడీ సూపర్‌స్టార్‌ అన్న టైటిల్‌ కార్డ్‌ మినహా. అది మాత్రం తన అనుమతి లేకుండా జరిగిందని పేర్కొంది. దాని గురించి దర్శకుడిని అడిగితే అది సర్‌ప్రైజ్‌ కోసం అని చెప్పారన్నారంది. నిజం చెప్పాలంటే తనను లేడీ సూపర్‌స్టార్‌ అంటే 10 మంది సంతోషపెడితే 50 మంది తిట్టుకుంటున్నారంది. బహుశా అలా అనిపించుకునే స్థాయికి ఎదిగానో లేదో తెలియదన్నారు.

ఇదీ చదవండి: నయనతార 75వ మూవీ 'అన్నపూరణి' రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?

కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ అనే బిరుదు కేవలం రజనీకాంత్‌కు మాత్రమే ఉండాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటారు. ఆ ట్యాగ్‌లైన్‌ను ఎవరికీ ఉపయోగించకూడదని వారి అభిప్రాయం. కానీ అన్నపూరణి చిత్రంలో లేడి సూపర్‌ స్టార్‌ అని టైటిల్‌ కార్డులో పడటంతో ఆమెపై రజనీ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంపైనే ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement