అన్‌లిమిటెడ్‌ నవ్వులు | Nayanathara Mookuthi Amman 2 movie Launch | Sakshi
Sakshi News home page

అన్‌లిమిటెడ్‌ నవ్వులు

Published Fri, Mar 7 2025 4:15 AM | Last Updated on Fri, Mar 7 2025 4:15 AM

Nayanathara Mookuthi Amman 2 movie Launch

నయనతార లీడ్‌ రోల్‌లో ‘మూకుత్తి అమ్మన్‌ 2’ సినిమా ఆరంభమైంది. సుందర్‌ సి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్‌ ఘోష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  డా. ఇషారి కె. గణేశ్‌ నిర్మిస్తున్నారు. కోటి రూపాయలతో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. 

‘‘నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్‌: పార్ట్‌ 1’ భారీ విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో రిలీజ్‌  కాగా మంచి స్పందన లభించింది. ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చిత్రం అన్‌లిమిటెడ్‌ నవ్వులతో కూడిన ఎగ్జయిటింగ్‌ కథాంశంతో ఉంటుంది. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ మూవీని అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తాం’’ అని మేకర్స్‌ తెలిపారు. నిర్మాతలు సునీల్‌ నారంగ్, సి. కల్యాణ్, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement