మేలో థ్రిల్‌ | Naveen Chandra Eleven gets new release date | Sakshi
Sakshi News home page

మేలో థ్రిల్‌

Apr 6 2025 2:34 AM | Updated on Apr 6 2025 2:34 AM

Naveen Chandra Eleven gets new release date

నవీన్‌ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్‌ లెవెన్‌’. డైరెక్టర్‌ సుందర్‌ సి. వద్ద ‘కలకలప్పు 2, వందా రాజావా దాన్‌ వరువేన్, యాక్షన్‌’ వంటి చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేసిన లోకేశ్‌ అజ్లస్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అభిరామి, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషించారు.

ఏఆర్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై అజ్మల్‌ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమాను మే 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించి, నవీన్‌ చంద్ర పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్‌ లెవెన్‌’. ఈ మూవీ ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్‌ అశోకన్‌.  

Advertisement
 
Advertisement
Advertisement