Naresh, Pavitra Lokesh Malli Pelli OTT Streaming Partner Details - Sakshi
Sakshi News home page

Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ రిలీజ్‌ ఎక్కడంటే?

Published Sat, May 27 2023 6:24 PM | Last Updated on Sat, May 27 2023 7:06 PM

Naresh, Pavitra Lokesh Malli Pelli OTT Streaming Partner Details - Sakshi

ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్నా

సీనియర్‌ నటుడు నరేశ్‌ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్‌ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్‌ హీరోయిన్‌గా నటించింది. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్‌లో ప్రమోషన్స్‌ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్‌ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్‌ డిసైడ్‌ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్‌ ఉంది.

మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement