నా కొడుకుకి హిట్‌ 3 సినిమా చూపించను : నాని | Know Reason Behind Why Actor Nani Says He Wont Show HIT 3 Movie To His Son, Deets Inside | Sakshi
Sakshi News home page

హిట్‌ 3 సినిమా నా కొడుకుకి చూపించను : నాని

Apr 30 2025 2:33 PM | Updated on Apr 30 2025 5:00 PM

Nani Says He Wont Show HIT 3 Movie To His Son

నాని(Nani) హీరోగా నటించిన హిట్‌ 3(HIT 3 ) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్‌ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్‌ సేన్‌, రెండో భాగంలో అడివి శేష్‌ హీరోగా నటించారు. ఇక మూడో భాగంలో అర్జున్‌ సర్కార్‌గా నాని అలరించబోతున్నాడు. అయితే మొదటి రెండు భాగాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. హిట్‌ 3 మాత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో రక్తపాతం అధికంగా ఉండబోతుందట. అందుకే సెన్సార్‌ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ  చేశారు.

 అలాగే  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించింది. ఈ లెక్కన సినిమా వయోలెన్స్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హీరో నాని కూడా వయోలెన్స్‌ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పిల్లలు ఎవరూ ఈ సినిమా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. 

తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. ‘హిట్‌ 3లో వయోలెన్స్‌ ఎక్కువగానే ఉంటుంది. నా పిల్లలకు ఈ చిత్రం చూపించను. టీజర్‌, ట్రైలర్‌ కూడా చూపించలేదు. వాళ్లకు హిట్‌ 3 అనే ఒక సినిమా వస్తుందని తప్పా..అందులో నేను ఎలా నటించాననే విషయం తెలియదు. మీరు(ప్రేక్షకులు) కూడా మీ పిల్లలకు ఈ సినిమా చూపించకండి. 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమాకి రండి. చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని నాని చెప్పారు.  శైలేష్‌ కొలను తెరకెక్కించిన  ఈ చిత్రం మే 1న రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement