
టాలీవుడ్ కొద్దికాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ సైతం బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈనెల 10న బాలయ్య బర్త్ డే కావడంతో రెండు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ మూవీని జూన్ 8న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. 200లో వచ్చిన ఈచిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.