విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి | Nandamuri Balakrishna Fan Died While Watching Akhanda Movie In Rajahmundry | Sakshi
Sakshi News home page

Akhanda Movie: అఖండ సినిమా చూస్తూ బాలయ్య అభిమాని మృతి

Dec 4 2021 8:37 PM | Updated on Dec 4 2021 9:36 PM

Nandamuri Balakrishna Fan Died While Watching Akhanda Movie In Rajahmundry - Sakshi

Hero Balakrishna Fan Died While Watching Akhanda Movie: ప్రస్తుతం ఎక్కడ చూసిన అఖండ మానియ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటూ విజయం వైపు దూసుకెళుతోంది. దీంతో అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఫుల్‌ జోష్‌లో ఉన్న హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అఖండ సినిమా చూస్తున్న ఆయన అభిమాని ఒకరు మృతి చెందారు. బాల‌య్య వీరాభిమాని, ఈస్ట్ గోదావ‌రి జిల్లా ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు జాస్తి రామ‌కృష్ణ అఖండ సినిమా చూస్తూ హ‌ఠాన్మ‌ర‌ణం చెందాడు. స్థానిక శ్యామ‌ల థియేట‌ర్‌లో ఆయ‌న అఖండ సినిమా చూస్తూ అక‌స్మాత్తుగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు.

చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా?

అది గ‌మ‌నించిన థియేట‌ర్ యాజ‌మాన్యం ఆయ‌నను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సినిమా చూస్తున్న స‌మ‌యంలో బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో జాస్తి రామ‌కృష్ణ మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి ఆయన కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు జాస్తి రామకృష్ణ. ఆయన మ‌ర‌ణంపై జిల్లాలోని ఇత‌ర ఎగ్జిబిట‌ర్లు సంతాపం తెలిపారు. రామ‌కృష్ణ మ‌ర‌ణం జిల్లాకు తీర‌ని లోటు అని అన్నారు. రామ‌కృష్ణ మ‌ర‌ణంపై బాల‌య్య అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్‌

Advertisement
 
Advertisement
Advertisement