'ఈ అమ్మాయి ఒక పవర్‌ హౌస్‌'.. రష్మికపై నాగార్జున ప్రశంసలు! | Nagarjuna Praises Actress Rashmika In Kuberaa Movie Press Meet | Sakshi
Sakshi News home page

Nagarjuna: 'మేము చేయలేనిది కూడా రష్మిక చేస్తుంది'.. నాగార్జున ప్రశంసలు

Jun 10 2025 4:49 PM | Updated on Jun 10 2025 5:36 PM

Nagarjuna Praises Actress Rashmika In Kuberaa Movie Press Meet

అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన  ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్‌ ధనుశ్‌ నటించారు. ఈ మూవీలో నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్‌ ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌కు హీరో నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికపై ప్రశంసలు కురిపించారు.

ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్‌ ఆఫ్‌ టాలెంట్‌ అని నాగార్జున కొనియాడారు. రష్మిక గత మూడేళ్లుగా సినిమాల్లో అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. మేము ఎవరూ చేయలేని.. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల సినిమాలు రష్మిక మాత్రమే చేయగలదని అన్నారు. మా అందరికంటే రష్మికనే పెద్ద చిత్రాలు చేసిందని నాగార్జున ప్రశంసలు కురిపించారు. 

(ఇది చదవండి: మా సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత)

కాగా.. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్బ్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్‌ క్రియేషన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్‌ అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement