
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే.