Nagarajuna Akkineni: అవికా గోర్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్‌

Nagarjuna Interesting Comments on Avika Gor in Popcorn Trailer Launch Event - Sakshi

‘‘పాప్‌ కార్న్‌’ ట్రైలర్‌ చాలా బాగుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు హిట్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో అక్కినేని నాగార్జున. అవికా గోర్, సాయి రోనక్‌ జంటగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్‌ కార్న్‌’. ఎం.ఎస్‌. చలపతి రాజు సమర్పణలో బోగేంద్ర గుప్తా నిర్మించారు. అవికా గోర్, ఎం.ఎస్‌. చలపతి రాజు, శేషు బాబు పెద్దింటి సహనిర్మాతలు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పదేళ్ల ముందు బ్రెజిల్‌లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామని వెళ్లాను. అక్కడ అవికా గోర్‌ ముఖాన్ని చూశాను.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను స్పానిష్‌లోనూ డబ్‌ చేశారు. 128 దేశాల్లో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను డబ్‌ చేశారని ఆ తర్వాత తెలిసింది. అవికా ఎప్పుడో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ అయ్యింది. ‘పాప్‌ కార్న్‌’లో హీరోయిన్‌గా నటించి, నిర్మాతగానూ మారినందుకు అభినందనలు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభమైంది. నాగార్జునగారు మంచి నిర్మాత మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా. ‘పాప్‌ కార్న్‌’కి నిర్మాతగా చేయటం రిస్క్‌ అని కొందరు అన్నారు. కానీ, ఆ రిస్క్‌ తీసుకోవటం గర్వంగా ఉంది’’ అన్నారు అవికా గోర్‌. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top