breaking news
Popcorn Movie
-
‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..
మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడటం సామాన్యులకు భారంగా మారుతోందన్న విమర్శలపై పీవీఆర్ ఇనాక్స్ (PVR INOX) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ వివరణ ఇచ్చారు. పీవీఆర్ సినిమాస్ టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ అధికారిక గణాంకాలతో కూడిన వివరాలను వెల్లడించారు. 2025 డిసెంబర్ నాటి ఆర్థిక నివేదికల ప్రకారం, పీవీఆర్ నెట్‌వర్క్‌లో సగటు టికెట్ ధర రూ.259 మాత్రమే ఉందని పేర్కొన్నారు.విమర్శలపై వివరణచాలామంది ప్రేక్షకులు లగ్జరీ స్క్రీన్లు లేదా ప్రీమియం థియేటర్ల ధరలను చూసి మొత్తం చైన్(పీవీఆర్ ఐనాక్స్‌లోని అన్ని థియేటర్లు) అంతా అలాగే ఉంటుందని అపోహ పడుతున్నారని ఆయన అన్నారు. ‘లగ్జరీ స్క్రీన్లలో ధరలు రూ.600-700 ఉండొచ్చు. కానీ అది అందరికీ కాదు. హెడ్‌లైన్స్ చూసి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు తప్ప, పూర్తి వివరాలు చూడటం లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. పాప్‌కార్న్ ధరలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. సాధారణ పాప్‌కార్న్ ధర కేవలం రూ.159 నుంచే మొదలవుతుందని, రూ.400 వరకు ఉండే పాప్‌కార్న్ బకెట్లపై ‘అన్లిమిటెడ్ రిఫిల్స్’ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు.ప్రేక్షకులకు ఆఫర్లుసామాన్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పీవీఆర్ ఇనాక్స్ పలు రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని స్క్రీన్లల్లో మంగళవారాల్లో టికెట్ ధరలను రూ.95 - రూ.100 వరకు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వారాంతాల్లో ఫుడ్ ఐటమ్స్ మీద ప్రత్యేక రాయితీలు, అన్లిమిటెడ్ రిఫిల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పీవీఆర్ పాస్’ వంటి మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే వీలుందని చెప్పారు.బిగ్ స్క్రీన్ అనుభవంఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా బిగ్ స్క్రీన్ ఇచ్చే అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమేనని బిజ్లీ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, కంఫర్టబుల్ సీటింగ్, హై-క్వాలిటీ విజువల్స్ అందించడానికి రూ.259 సగటు ధర అనేది అత్యంత సమంజసమైనదని సమర్థించుకున్నారు.ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!? -
Popcorn: ఆకట్టుకుంటున్న ‘మది విహంగమయ్యే’ సాంగ్
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మది విహంగమయ్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో అక్కినేని నాగచైతన్య విడుదల చేసి, సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని చక్కటి లిరిక్స్‌తో పాటలో పొందు పరిచారు లిరిక్ రైటర్ శ్రీజో. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ .. ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా అంతా లిఫ్టులోనే ఉంటుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది’అన్నారు. ‘కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం’అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. -
అప్పుడే బ్రెజిల్ స్టూడియోలో అవికా ముఖాన్ని చూశాను: నాగార్జున
‘‘పాప్ కార్న్’ ట్రైలర్ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో అక్కినేని నాగార్జున. అవికా గోర్, సాయి రోనక్ జంటగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్. చలపతి రాజు సమర్పణలో బోగేంద్ర గుప్తా నిర్మించారు. అవికా గోర్, ఎం.ఎస్. చలపతి రాజు, శేషు బాబు పెద్దింటి సహనిర్మాతలు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పదేళ్ల ముందు బ్రెజిల్లో రియో సిటీకి ఓ స్టూడియో చూద్దామని వెళ్లాను. అక్కడ అవికా గోర్ ముఖాన్ని చూశాను. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను స్పానిష్లోనూ డబ్ చేశారు. 128 దేశాల్లో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌ను డబ్ చేశారని ఆ తర్వాత తెలిసింది. అవికా ఎప్పుడో పాన్ వరల్డ్ స్టార్ అయ్యింది. ‘పాప్ కార్న్’లో హీరోయిన్గా నటించి, నిర్మాతగానూ మారినందుకు అభినందనలు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభమైంది. నాగార్జునగారు మంచి నిర్మాత మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా. ‘పాప్ కార్న్’కి నిర్మాతగా చేయటం రిస్క్ అని కొందరు అన్నారు. కానీ, ఆ రిస్క్ తీసుకోవటం గర్వంగా ఉంది’’ అన్నారు అవికా గోర్. -
‘పాప్ కార్న్’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో నాగార్జున (ఫొటోలు)
-
Popcorn Trailer: పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే..
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. డిఫరెంట్ మైండ్స్ సెట్స్ ఉన్న ఇద్దరు వ్యక్తుల అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. ముందు ఒకరంటే ఒకరికి పడకుండా ఉన్న వాళ్లిద్దరూ సమయం గడిచేకొద్ది స్నేహితులుగా మారుతారు. ఒకరిపై మరొకరికి అభిమానం కలుగుతుంది. ఈ జర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. రొటీన్‌కు భిన్నంగా దర్శకుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకనిర్మాతలు తెలిపారు.


