Krishna Vrinda Vihari Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Krishna Vrinda Vihari In OTT: దీపావళికి ఓటీటీలో ‘కృష్ణ వ్రింద విహారి’ సందడి, స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎక్కడంటే

Oct 12 2022 3:37 PM | Updated on Oct 12 2022 4:58 PM

Naga Shourya Krishna Vrinda Vihari Streaming on Netflix From October 23rd - Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. న్యూజిలాండ్ గాయ‌ని, న‌టి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే దసరాకు ముందు దసరాకి ముందు థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది.

చదవండి: సరోగసీ వివాదం.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన నయన్‌ దంపతులు!

ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాలం నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 23న నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. కాగా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈమూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. కాగా దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి..  కృష్ణ వ్రింద అక్టోబర్‌ 23 నుంచి అందుబాటులోకి రానుందంటూ నెట్‌ఫ్లిక్సలో ఆప్షన్‌ కనిపిస్తోంది. దీంతో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి థియేటర్ల నవ్వులు పూయించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement