‘థ్యాంక్యూ’ కోసం ఇటలీకి పయనమైన నాగచైతన్య

Naga Chaitanya Will Go To Italy For Thank You Movie Shooting - Sakshi

నాగచైతన్య ఇటలీలో ‘థ్యాంక్యూ’ చెప్పనున్నారు. ‘మనం’ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో అవికా గోర్‌ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ ఇటీవల విశాఖపట్నంలో ముగిసింది.

ఒక ఫారిన్‌ షెడ్యూల్‌ మిగిలి ఉంది. ఈ షెడ్యూల్‌ను ఇటలీలో జరపాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. మొత్తం పదిహేను రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకుంటున్నారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫారిన్‌ షెడ్యూల్‌ ఉంటుందా? లేదా? అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.  
చదవండి:
ఆటో డ్రైవర్‌కు సమంత ఊహించని గిఫ్ట్‌‌
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..‌ ‘ఐకాన్’ మూవీపై దిల్‌రాజు క్లారిటీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top