శ్రీకాకుళంలో తండేల్‌ | Naga Chaitanya And Sai Pallavi Thandel Movie Shooting In Srikakulam, Deets Inside | Sakshi
Sakshi News home page

Thandel Movie Shooting: శ్రీకాకుళంలో తండేల్‌

Published Fri, Jun 21 2024 3:29 AM | Last Updated on Fri, Jun 21 2024 1:34 PM

Naga Chaitanya Thandel Movie up dates

శ్రీకాకుళంలో ల్యాండ్‌ అయింది ‘తండేల్‌’ టీమ్‌. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్యతో ఈ సినిమా కోసం మళ్లీ జోడీ కట్టారు సాయి పల్లవి. ‘ప్రేమమ్‌’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత నాగచైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.

2018లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సెమీ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ శ్రీకాకుళంలో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయి పల్లవిపై లవ్, ఎమోషనల్‌ సీన్స్‌ చిత్రీకరించనున్నారు. ఈ  సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement