Naga Chaitanya Reacts To Divorce With Samantha For The First Time - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: 'ఏం జరిగినా అంతా మంచికే.. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను'

May 5 2023 6:49 PM | Updated on May 5 2023 7:47 PM

Naga Chaitanya Reacts To Divorce With Samantha For The First Time - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌గా పేరొందిన నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటికీ వీరి విడాకుల అంశంపై సోషల్‌ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తొలిసారిగా నాగచైతన్య సమంతతో విడాకులపై స్పందించాడు. అంతేకాకుండా తాము విడిపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు.

చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి

కస్టడీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. ''మేం విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇద్దరం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తాను. నిజానికి సమంత మంచి అమ్మాయి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు.



సోషల్‌ మీడియాలో వచ్చిన రూమర్స్‌ వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా రూమర్స్‌ గురించి అంతగా పట్టించుకోలేదు..కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మేం విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. కానీ మీడియా, వెబ్‌సైట్స్‌.. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరించడం నా మనసును బాధపెట్టింది.

అంతేకాకుండా నా గతంతో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్లను అగౌరవపరిచినట్లు వార్తలు రాశారు. అది చాలా చెత్త విషయం. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదే. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చై. చదవండి: యంగ్‌ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement