Naga Chaitanya Meets Sanjay Leela Bhansali And Karan Johar in Mumbai, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సంజయ్‌ లీలా భన్సాలీ, కరణ్‌ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా?

Aug 4 2022 10:39 AM | Updated on Aug 4 2022 11:16 AM

Naga Chaitanya Meets Sanjay Leela Bhansali And Karan Johar in Mumbai - Sakshi

యంగ్‌ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన బాలీవుడ్‌ చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోనే చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం చై కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే.  ఇది చైకి ఫస్ట్‌ మూవీ కావడంతో లాల్‌ సింగ్‌ చద్దాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ మూవీ ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చైకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ బయటకు వచ్చింది.  లాల్‌ సింగ్‌ చద్దా మూవీని ప్రమోట్‌ చేస్తూనే మరోవైపు బాలీవుడ్‌ మార్కెట్‌పై చై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, నిర్మాత కరణ్‌ జోహార్‌ని అతడు కలిసినట్లు సమాచారం.

చదవండి: ప్రస్తుత టాలీవుడ్‌ కష్టాలకు కారణం డైరెక్టర్‌ రాజమౌళినే: వర్మ

చైతన్య నిన్న(బుధవారం) ముంబైలోని సంజయ్‌ లీలా భన్సాలీ ఆఫీసుకి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ ప్రమోషన్‌ అనంతర నేరుగా చై సంజయ్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమయ్యాడట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయా? అని అంత చర్చించుకుంటున్నారు. ఇక ఏదేమైన చైతన్య, సంజయ్‌ భన్సాలీని కలవడం టాలీవుడ్‌లో ఆసక్తిని సంతరించుకుంది. ఇది అక్కినేని ఫ్యాన్స్‌ చైతో దేవదాసు మూవీ చేయండి అంటూ కోరుతున్నారు. అయితే చై, సంజయ్‌ లీలా భన్సాలి కలవడం వెనక అసలు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. కాగా లాల్‌ సింగ్‌ చద్దాలో చై బాలరాజు అనే ఆర్మి యువకుడిగా కనిపించనున్నాడు.

చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ వార్తలపై నోరు విప్పిన చై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement