Naga Chaitanya: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే..

Naga Chaitanya Response On Dating Rumours With Bollywood Actress - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగా ఉంచుతాడు. అందుకే సోషల్‌ మీడియా, మీడియా ముందుకు చాలా అరుదుగా వస్తాడు. వృత్తిపరమైన విషయాలనే పంచుకునే చై వ్యక్తిగత జీవితంపై ఇటీవల రూమర్లు వస్తున్న సంగతి తెలిసింది. హీరోయిన్‌ సమంతతో విడాకులు అనంతరం నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌ హీరోయిన్‌తో చైతన్య డేటింగ్‌ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న రూమర్లు, హీరోయిన్‌తో ప్రేమాయణం వంటి వార్తలపై స్పందించాడు చై.

చదవండి: స్టార్‌ హీరోకి ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!

నాగ చైన్య ప్రస్తుతం లాల్‌ సింగ్‌ చద్దా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన చైకి హీరోయిన్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా అతడు స్పందిస్తూ.. ‘ఈ మధ్య నాపై రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం ఏదోక పుకార్లు బయటకు వస్తుంది. వాటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి అసలు సంబంధమే లేని పుకార్లు సృష్టిస్తున్నారు. అసలు అవి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ప్రారంభంలో వాటిని చూసి నవ్వుకునే వాడిని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు’ అంటూ పరోక్షంగా తాను ఏ హీరోయిన్‌తో ప్రేమలో లేనని స్పష్టం చేశాడు.

చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

 కాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. ఇటీవల ఈ పుకార్‌పై స్పందించిన శోభితా ఆ వార్తలను కొట్టిపారేసియగా.. తాజాగా చై సైతం ఖండిచాడు. దీంతో ఇకనైనా ఇలాంటి వార్తలకు చెక్‌ పడుతుందో లేదో చూడాలి. ఇకపోతే లాల్‌ సింగ్‌ చద్దాతో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చై బాలరాజు అనే ఆర్మీ యువకుడి పాత్ర పోషిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top