Janhvi Kapoor Sells Her Luxury Juhu Apartments to Actor Rajkummar Rao - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: స్టార్‌ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Published Wed, Aug 3 2022 11:58 AM

Janhvi Kapoor Sells Her Luxury Juhu Apartments to Actor Rajkummar Rao - Sakshi

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌.  నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటికి పదును పెడుతోంది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జాన్వీ పలు ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా జాన్వీ తన లగ్జరీ ఇల్లును అమ్మేసిందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

జూహులోని ఓ అపార్టుమెంట్‌లోని తన ప్లాట్‌ను భారీ ధరకు ఓ స్టార్‌ నటుడికి అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల ఆమె సోదరుడు అర్జున్‌ కపూర్‌ సైతం తన ఇల్లును అమ్మేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్‌మెంట్‌లో గల 14, 15, 16 అంతస్థుల్లో నిర్మించిన ఈ లగ్జరీ ప్లాట్‌ను జాన్వీ 2020లో రూ. 35 కోట్లకు కొనుగొలు చేసిందట. 3456 sqf ఉన్న ఈ ఇంటిని ప్రముఖ నటుడు రాజ్‌ కుమార్‌ రావు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఉమా మహేశ్వరి అంత్యక్రియలు, పాడె మోసిన బాలయ్య

కాగా ఇటీవల రాజ్‌కుమార్‌ రావు, తన ప్రియురాలు, సహానటి పత్రలేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు ఉండేందుకు ఇంటి కోసం వెతుకుతుండగా జాన్వీని సంప్రదించాడు రాజ్‌ కుమార్‌. అప్పటికే తన లగ్జరీ ప్లాట్‌ను అమ్మాలని చూస్తున్న జాన్వీ రాజ్‌కుమార్‌కు అమ్మినట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జుహూలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌‌లో 14, 15, 16వ ఫ్లోర్లు కలిపి ఈ ఫ్లాట్ ఉంటుందట. అంతే కాకుండా కేవలం ఈ ఫ్లాట్ల పార్కింగ్ స్పేస్ కోసమే రాజ్‌కుమార్ రావు మరో రూ. 2.19 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
 
Advertisement