Naga Chaitanya Emotional Thank You Note | Nagarjuna | Hash - Sakshi
Sakshi News home page

Naga Chaitanya Thank You Note: నాగ చైతన్య ఎమోషనల్‌ నోట్‌.. సామ్‌ పెంపుడు కుక్కకు థ్యాంక్స్‌

Jul 6 2022 9:31 PM | Updated on Jul 7 2022 10:30 AM

Naga Chaitanya Emotional Thank You Note - Sakshi

Naga Chaitanya Emotional Thank You Note: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ మూవీని జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న నాగ చైతన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా పోస్ట్‌ చేశాడు. 

'థ్యాంక్యూ అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాను. కానీ కొన్ని సార్లు అదొక్కటే సరిపోదు. నా తదుపరి చిత్రం థ్యాంక్యూ ఈ ఆలోచనకు కారణం. ఈ మూవీ జర్నీ నన్ను కదిలించింది' అని రాసుకొస్తూ తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు. అలాగే తన అభిమానులను #themagicwordisthankyou అనే ట్యాగ్‌తో తమ జీవితంలో ఎవరికీ థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారో ఫొటోలను షేర్ చేసి ట్యాగ్‌ చేయమని కోరాడు. 

ఇందులో భాగంగానే చైతన్న చిన్నతనంలో తన తల్లితో తీసుకున్న ఫొటో, తండ్రి నాగార్జునతో కలిసి దిగిన పిక్‌తోపాటు సమంత పెంపుడు హ్యాష్‌తో తీసుకున్న ఫొటోను షేర్‌  చేశాడు. 'అన్ని విషయాల్లో నాకు సపోర్ట్‌ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్‌', 'నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు థ్యాంక్స్ నాన్న', 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్‌ హ్యాష్‌' అంటూ ఎమోషనల్‌గా నోట్స్ రాసుకొచ్చాడు చైతూ. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్‌ వైరల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement