తండ్రి నాగార్జున దారిలోనే నాగచైతన్య | Naga Chaitanya Debut As Producer With Dhootha 2 Series | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: పెళ్లి తర్వాత నాగచైతన్య మరో నిర్ణయం

Jun 5 2026 2:23 PM | Updated on Jun 5 2026 2:26 PM

Naga Chaitanya Debut As Producer With Dhootha 2 Series

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున కాస్త డిఫరెంట్. ఒకవైపు హీరో, విలన్, కీలక పాత్రలు, షో హోస్టింగ్ చేస్తూ మరోవైపు నిర్మాతగానూ అడపాదడపా సినిమాలు తీస్తుంటారు. ప్రస్తుతం తన 100వ మూవీ బిజీలో ఉన్నారు. మరోవైపు కొడుకుల్లో నాగచైతన్య 'వృషకర్మ' చిత్రం చేస్తుండగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుని ప్రకటించారు. 2023లో వచ్చిన వెబ్ సిరీస్ 'దూత' రెండో సీజన్ మొదలుపెట్టేశారు.

(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)

థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో మెప్పించిన 'దూత' సిరీస్‌లో నాగచైతన్య, ప్రియాభవానీ శంకర్, పార్వతి ప్రధాన పాత్రలు చేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకుడు. మళ్లీ ఇన్నాళ్లు రెండో సీజన్ లాంఛనంగా మొదలుపెట్టారు. అయితే దీనిలో నటించడంతో పాటు నిర్మాతగానూ నాగచైతన్య వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. ఆ వెంటనే 'తండేల్'తో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు నిర్మాతగానూ మారిపోయాడు. రాబోయే రోజుల్లో తను హీరోగా నటించే చిత్రాలతో పాటు శోభిత నటించే సినిమాలని కూడా నిర్మిస్తాడేమో! 'దూత' సిరీస్ తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.

(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్‌ అదే తంతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement