టైటిల్‌ ఫిక్స్‌? | Nag Ashwin on Kalki 2898 AD sequel update | Sakshi
Sakshi News home page

టైటిల్‌ ఫిక్స్‌?

Apr 27 2026 5:58 AM | Updated on Apr 27 2026 5:58 AM

Nag Ashwin on Kalki 2898 AD sequel update

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా రూపొందిన తొలి సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్‌ ప్రధానపాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్‌లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రానున్న తదుపరి చిత్రం ‘కల్కి 2’ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. కమల్, అమితాబ్‌పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

అయితే ప్రభాస్‌ ప్రస్తుతం ఫారిన్‌లో ఉన్నారని, మేలో ప్రారంభమయ్యే ఈ సినిమా షెడ్యూల్‌లో ఈ హీరోపాల్గొంటారని తెలిసింది. అలాగే ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ‘కల్కి 2898 ఏడీ’ (కల్కిపార్ట్‌ 1) సినిమాలో కర్ణుడిపాత్రలో ప్రభాస్‌ కొద్ది నిమిషాలు మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తారు. కానీ ‘కర్ణ 3102 బీసీ’ మూవీలో కర్ణుడిగా ప్రభాస్‌ స్క్రీన్‌పై దాదాపు 30 నిమిషాలు కనిపిస్తారట. 

ఇంకా ‘కల్కి 2’ మూవీ ముఖ్యంగా కర్ణుడి చుట్టూ తిరుగుతుందని, సినిమాలో కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది? అనే దానిపైనే ప్రధాన కథనం ఉంటుందని టాక్‌. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కల్కి 2’లో దీపికా పదుకోన్‌ నటించడం లేదని ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు. మరి... దీపిక ప్లేస్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement