ఆకట్టుకుంటున్న‘ చినుక‌మ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ సాంగ్‌ | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న‘ చినుక‌మ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ సాంగ్‌

Published Tue, May 17 2022 12:05 PM

Naa Venta Paduthunna Chinnadevadamma Movie First Song Out - Sakshi

‘హుషారు’ఫేమ్‌ తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’. వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు మేకర్స్‌. ‘పుడిమిని త‌డిపే తొల‌క‌రి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా ’అంటూ సాగే ఈ పాటకి డాక్టర్‌ భవ్య దీప్తిరెడ్డి లిరిక్స్‌ అందించగా.. రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు.

సందీప్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కి గ‌ణేష్ మాస్ట‌ర్  కొరియోగ్ర‌ఫి చేశారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ సాంగ్ ని ప్ర‌ముఖ న‌టులు , ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కులు త‌ణికెళ్ళ భ‌ర‌ణి   చేతుల మీదుగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా తణికెళ్ల భరణి మాట్లాడుతూ..  భవ్య దీప్తి  సాహిత్యంతో గణేశ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి చాలా బాగుంది. ఈ పాటలో హీరో తేజ, అఖిల చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రం మరింత విజ‌యం సాధించాల‌ని కొరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు వెంకట్‌ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్  ని ఆక‌ట్ట‌కుంటుంది’ అన్నారు.

Advertisement
 
Advertisement